Skip to main content

Namaste NRI

లాస్‌ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానం

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని  లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించారు. డ్యూన్‌ చిత్రానికి పలు విభాగాల్లో అవార్డుల పంట పడిరది. సౌండ్‌ ఎఫెక్ట్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, ఒరిజినల్‌ స్కోర్‌లో డ్యూన్‌ చిత్రానికి అవార్డుల వచ్చాయి. సినిమాటోగ్రఫీ విభాగంలో గ్రెగ్‌ ప్రాజర్‌కు (డ్యూన్‌) ఆస్కార్‌ అవార్డు వరించింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన డ్రైవ్‌ మై కార్‌ నిలిచింది. ఉత్తమ నటుడిగా విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచార్డ్‌), ఉత్తమ డైరెక్టర్‌గా జానే కాంపీయన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌) ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ట్రాయ్‌ కోట్సుర్‌కు (కోడా) ఆస్కార్‌ వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా అరియానా డీబ్రోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌కు అస్కార్‌ అవార్డు వరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events