Skip to main content

Namaste NRI

పుతిన్‌ ఇద్దరు కూతుళ్లపై కఠిన ఆంక్షలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇద్దరు కుమార్తెలపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేయనున్నది. రష్యాకు చెందిన బిలియనీర్ల జాబితాలో ఇప్పుడు పుతిన్‌ కుమార్తెలు కూడా చేరనున్నారు. పుతిన్‌ మొదటి భార్య లుదిమిలా ష్రిబనివాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కాటరినా టికనోవా, మారియా వొరొన్సోవాలపై ఆంక్షలను విధించేందుకు యురోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే సిద్దమైంది. పుతిన్‌ ఫ్యామిలీ గురించి బయట ఎక్కువగా విషయాలు తెలియదు. పుతిన్‌ కూతుళ్లపై ఆంక్షలు కొనసాగించాలంటే ఈయూ సభ్య దేశాలు దానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పుతిన్‌ ఫ్యామిలీతో పాటు మరికొంత మంది రష్యా సంపన్నులపై యురోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించే ప్రయత్నాల్లో ఉంది.

Social Share Spread Message

Latest News