Skip to main content

Namaste NRI

దీని కోసం యావత్‌ ప్రపంచం..ఎదురుచూస్తోంది

ఉక్రెయిన్‌ దేశంపై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో  అమెరికా నేతృత్వంలో జరుగుతున్న నాటో కూటమి సమావేశంలో జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగం చేశారు. సైనిక మద్దతును అందించాలని నాటోను కోరారు.  ఉక్రెయిన్‌లో రష్యా ఫాస్పరస్‌ బాంబులను ఉపయోగిస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. సైనిక మద్దతును అందించాలని నాటోను కోరినట్లు తెలిపారు. రష్యా ఫాస్పరస్‌ బాంబులు ఉపయోగించిందని, ఈ ఘటనతో పెద్దలతో పాటు చిన్నారులు చాలా మంది చనిపోయారని తెలిపారు. మా ప్రజలు, మా నగరాలను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌కు ఎలాంటి పరిమితులు లేని సైనిక సహకారం కావాలి. ఎలాగైతే రష్యా ఎలాంటి పరిమితులు లేకుండా మాపై అన్ని ఆయుధాలను ప్రయోగిస్తుందో అలాంటి సకారం నాటో నుంచి కావాలి. ప్రజలను కాపాడేందుకు ఈ కూటమి ఏం చేయగలదో నాటో ఇంకా చెప్పట్లేదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ కూటమి అని నాటో నిరూపించుకోవాలి. దీని కోసం యావత్‌ ప్రపంచం, ముఖ్యంగా ఉక్రెయిన్‌ ఎదురుచూస్తోంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News