Namaste NRI

పీవీఆర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం1 షూటింగ్‌ ప్రారంభం

 రామ్‌తేజ్‌, గరిమ జంటగా పీవీఆర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అక్షయ్‌కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ క్లాప్‌నివ్వగా, రామసత్యనారాయణ కెమెరా స్విఛాన్‌ చేశారు.  అనంతరం డాక్టర్‌ ప్రతాని మీడియాతో మాట్లాడుతూ పీవీఆర్‌ ఫ్యాషన్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాడని అన్నారు.  దర్శకుడు అజయ్‌ కృష్ణకు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో అనుభం ఉందన్నారు. కాన్సెప్ట్‌ బాగుంటే కొత్త, పాత, చిన్నా, పెద్ద అని చూడకుండా ప్రేక్షకులు సినిమాలకు ఆదరిస్తున్నారని అన్నారు. అలాంటి మంచి కంటెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ   ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై  ఓ యువకుడు ఎలాంటి పోరాటం సాగించాడన్నదే చిత్ర కథాంశం అన్నారు. త్వరలో చీరాలలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత పీవీఆర్‌ తెలిపారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శబరినాథ్‌, సంగీతం: రాజా, నిర్మాత: పీవీఆర్‌, రచన`దర్శకత్వం: అక్షయ్‌ కృష్ణ నల్లం.  ఈ కార్యక్రమంలో హీరో రామ్‌తేజ్‌, హీరోయిన్‌ గరిమ, మధుప్రియ, నాగరాజు, ఆనంద్‌రాజు ఓంకాం తదితరులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events