Namaste NRI

పార్లమెంట్ కు సైకిల్ పై రాహుల్

ఉభయసభల్లో విపక్షాలు వ్యవహరించే వ్యూహాలపై బ్రేక్‌ ఫాస్ట్‌ భేటీలో చర్చించిన తర్వాత, రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లారు. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పెగాసస్‌ వ్యవహారం, ఇంధన ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చినట్టు రాహుల్‌ తెలిపారు. అచ్చేదిన్‌ అంటే ఏంటి? అనే ప్లకార్డును తన సైకిల్‌కు కట్టుకుని పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సైకిల్‌ యాత్రలో తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీతో పాలు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ సైకిల్‌ యాత్ర కొనసాగింది.  విపక్షలు లేవనెత్తిన అంశాలపై ప్రధానంగా చర్చించాలని రాహుల్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ ఒప్పందంలో కోట్లాది ప్రజా ధనం చేతులు మారిందని ఆరోపించారు. రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే మూడుసాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ సైకిల్‌ యాత్ర సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]