Skip to main content

Namaste NRI

రాజశేఖర్ బర్త్ డే.. శేఖర్ మూవీ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో సినీ ప్రముఖులు, మిత్రులు రాజశేఖర్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో తను నటించిన 91వ సినిమా శేఖర్‌  చిత్రంలో కిన్నెర సాంగ్‌ను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా రిలీజ్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ సోకినప్పుడు బతుకుతానా లేదా అనిపించింది. ఆ సమయంలో అభిమానుల ప్రార్థనలు ఫలించి ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయగలుగుతున్నాను. వారే నా బలం అని అన్నారు. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్‌ దర్శకురాలు. స్క్రీన్‌ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్‌ సినీ కార్ప్‌, టారస్‌ సినీ కార్ప్‌, సుధాకర్‌ ఇంపెక్స్‌ ఐపీఎల్‌, త్రిపురా క్రియేషన్ప్‌ పతాకాలపై బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలైన కిన్నెర సాంగ్‌కు ప్రేక్షకుల నుండి హ్యుజ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ కార్యక్రమంలో సమీర్‌, భరణి శంకర్‌, రవి వర్మ, అనూప్‌ రూబెన్స్‌, నిరంజన్‌, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events