Namaste NRI

రణ్ వీర్ సింగ్ -పూజాహెగ్డేల… సర్కస్ ట్రైలర్ రిలీజ్

రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి నిర్మిస్తున్న చిత్రం సర్కస్‌.  పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటిస్తున్నారు.  ఈ చిత్రంతో దీపికా పదుకొణె ప్రత్యేక గీతంలో ఆడిపాడిరది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ వేడుకలో షారుక్‌పై అభిమానాన్ని చాటుకున్నారు రణ్‌వీర్‌సింగ్‌. నాకే కాదు చాలామందికి షారుఖ్‌ఖాన్‌ ఆదర్శం. మేమందరం ఆయన్ని చూసే నటులయ్యాం. ఆయన సాధించిన దానిలో కొంచెం సాధించిన అది నాకు చాలా గొప్ప విజయం అని తెలిపారు రణ్‌వీర్‌. సర్కర్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 1960ల నాటి పరిస్థితులు అందులో కనిపిస్తాయి. ఇందులోని ఐటెమ్‌సాంగ్‌లో దీపికా తళుక్కున మెరిసి అలరించింది. షేక్‌స్పియర్‌ నాటకం కామెడీ  ఎర్రర్స్‌ ఆధారంగా ఇది తెరకెక్కింది.  డిసెంబర్‌ 23న క్రిస్మన  కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల  ముందుకు  రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events