Skip to main content

Namaste NRI

సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న

రష్మిక మందన్న ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 400 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకుంది రష్మిక మందన్న. ఈ ఛారిటీ కోసం ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి 400 కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఒక్కోవిడత 400 కుటుంబాలకు మూడు నెలల పాటు నిత్యావసర సరుకులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

వచ్చే ఏడాది మొత్తం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. దీనివల్ల ఆ కుటుంబాలు సరుకుల కోసం చేసే ఖర్చు ఆదా అవుతుంది. ఆ మొత్తాన్ని వారు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు అని రష్మిక మందన్న పేర్కొన్నది. సేవా కార్యక్రమాలంటే పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదని, దయాగుణంతో చేసే చిన్న సాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చుతుందని, మనందరం ఏదో ఒక చిన్న పనితో ఇతరులను ఆదుకోవాలని రష్మిక మందన్న పిలుపునిచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events