Skip to main content

Namaste NRI

ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రౌద్ర రూపాయ న‌మః ఫ‌స్ట్ సింగిల్ లాంచ్

బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రౌద్ర రూపాయ నమః. పాలిక్‌ దర్శకత్వంలో రావుల రమేష్‌ నిర్మిస్తున్నారు. మోహన సిద్ధిఖి, పాయల్‌రాజ్‌పుత్‌ నటిస్తున్నారు.  చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. సుర సుర అసురసుర..హర హర అతి భయంకరా అంటూ సాగిన ఈ గీతాన్ని సురేష్‌ గంగుల రచించారు. జాన్‌భూషణ్‌ స్వరపరిచారు. చక్కటి సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటుందని, విజువల్స్‌ కూడా బాగుంటాయని దర్శకుడు తెలిపారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. న‌టుడు రఘు మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు విడుద‌లైన సుర సుర సాంగ్ పెద్ద హిట్ చేస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు. ర‌ఘు, వెంక‌ట్, మోహ‌న సిద్దిఖి, పాయ‌ల్ రాజ్ పుత్,  సీనియ‌ర్ న‌టుడు సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్,  ర‌ఘు, వెంక‌ట్  ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు.     ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌, పాటలు: సురేష్‌ గంగుల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పాలిక్‌. సంగీతం జాన్ భూష‌న్‌; స్టంట్స్ః ర‌న్ ర‌వి;  ఎడిట‌ర్ః రామ‌కృష్ణ అర్ర‌మ్‌; ఆర్ట్ః సురేష్ భీమ‌గాని;  లిరికల్ వీడియో: నిశాంత్ , పీఆర్వోః ర‌మేష్ చందు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events