Skip to main content

Namaste NRI

భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న రావణాసుర

రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ రావణాసుర. ఈ సినిమా మూడో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక  సన్నివేశాలు చిత్రీకరించినట్లు వెల్లడిరచారు. విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది.  ఇందులో రవితేజ  న్యాయవాదిగా కనిపించనున్నారు. సినిమాలోని ఐదుగురు నాయికలకు ఎంతో ప్రాధాన్యముంది.  సుశాంత్‌  కీలక పాత్రలో సందడి చేస్తారు అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విడుదలైన రవితేజ సుశాంత్‌ ఫస్ట్‌ లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌ కథతో పాటు మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు అని చిత్రయూనిట్‌ పేర్కొంది. అభిషేక్‌ నామా నిర్మాత. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌  కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events