Skip to main content

Namaste NRI

రావణాసుర.. సుశాంత్ ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం రావణాసుర. హీరోలు లేరు అనేది ట్యాగ్‌లైన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ  టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా నిర్మించనున్న ఈ చిత్రంలో లాయర్‌ పాత్రలో కనిపిస్తారు రవితేజ. అయితే ఈ చిత్రంలో రామ్‌ అనే కీలక పాత్రను హీరో సుశాంత్‌ చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సుశాంత్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. రావణాసుర స్క్రిప్ట్‌, రామ్‌ పాత్ర నచ్చి సుశాంత్‌ ఈ సినిమాకు ఓకే చెప్పారు. శ్రీకాంత్‌ విస్సా కథ  అందించిన ఈ చిత్రం యాక్షన్‌, థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. రవితేజ నటిస్తున్న 70వ చిత్రమిది. ఈ నెల 14న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమవుతుంది.  ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News