Skip to main content

Namaste NRI

రాయవలస నుంచి మా ఊరు రాయవలస సాంగ్ రిలీజ్

కార్తీక్‌ జయంతి, శ్రీష నులు జంటగా నటిస్తున్న చిత్రం రాయవలస. రాధిక జయంతి దర్శకత్వంలో గోపికృష్ణ జయంతి నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. మా ఊరు రాయవలస అంటూ సాగే ఈ గీతాన్ని హీరో విశ్వక్‌సేన్‌ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

అర్జున్‌ బాల స్వరపరిచిన ఈ గీతాన్ని రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాశ్‌, కాశీవిశ్వనాథ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 11న ఘనంగా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: కిట్టు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events