Skip to main content

Namaste NRI

పుతిన్ తలపై రికార్డు.. అరెస్ట్ చేసినా, చంపినా రూ.7.5 కోట్లు

రష్యా కుబేరుడు ఒకరు పుతిన్‌ తలపై రికార్డు ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లతో రష్యాను విడిచిపెట్టి అమెరికాలో ఉంటున్న అలెక్స్‌ కొనానిఖిన్‌ ఓ సంపన్నుడు. అనేక రాజకీయపరమైన కారణాలతో కొనానిఖిన్‌ 1992లో రష్యాను వీడి అమెరికా చేరుకున్నారు. అక్కడే అనేక స్టార్టప్‌ లలో పెట్టుబడులు, క్రిప్టో వ్యాపారాలతో తన సంపదను వేల కోట్లకు పెంచుకున్నాడు. అయితే పుతిన్‌ అనుసరిస్తున్న విధానాలు కొనానిఖిన్‌ కు కోపం తెప్పించాయి. ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ ఆగ్రహం మరింత పెరిగింది. అందుకే పుతిన్‌ ను సజీవంగా బంధించినా, చంపేసినా భారీ మొత్తంలో నజరానా అందిస్తానని  కొనానిఖిన్‌ ఓ ప్రకటన చేశాడు. పుతిన్‌ను ప్రాణాలతో అరెస్ట్‌ చేసిన వారికి, లేదా చంపేసినా సరే వారికి రూ.7.5 కోట్లు ఇస్తామని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News