Skip to main content

Namaste NRI

గ్రీన్ కార్డుల ప‌రిస్థితి ఎలా ఉన్నా … 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్‌

గ్రీన్‌ కార్డు ప్రోగ్రాంపై అమెరికా స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల త‌మ ప‌నిపై ఎటువంటి ప్ర‌భావాన్ని చూప‌దు అని టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్(టీసీఎస్‌) పేర్కొన్న‌ది. విదేశీ వ‌ర్క‌ర్ల‌కు గ్రీన్ కార్డులు జారీ చేసే అంశంలో 8 ఐటీ కంపెనీల‌ పై అమెరికా నిషేధాన్ని విధించింది. టీసీఎస్, ఇన్‌ఫోసిస్‌, విప్రో, కాగ్నిజాంట్‌, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి. అమెరిక‌న్ జాబ్ మార్కెట్‌లో స్థానికుల‌కు ఉద్యోగాలు రావ‌డం లేద‌న్న ఉద్దేశంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా నిర్ణ‌యం ప‌ట్ల టీసీఎస్ స్పందిస్తూ త‌మ వ‌ర్క్‌ఫోర్స్ స్ట్రాట‌జీలో కానీ, క‌స్ట‌మ‌ర్ ఎంగేజ్మెంట్‌లో కానీ ఎటువంటి ప్ర‌భావం ఉండ‌బోద‌ని పేర్కొన్న‌ది. తాము లోక‌ల్ హైరింగ్‌పై ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు టీసీఎస్ చెప్పింది.

గ‌డిచిన రెండేళ్ల నుంచి త‌మ ప‌ర్మ‌నెంట్ లేబ‌ర్ స‌ర్టిఫికేష‌న్ ప్రోగ్రామ్‌ ద‌ర‌ఖాస్తుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంద‌ని, గ్రీన్ కార్డుల‌ను స‌స్పెండ్ చేయ‌డం వ‌ల్ల త‌మ వ‌ర్క్‌ఫోర్స్ స్ట్రాట‌జీలో మార్పు ఉండ‌బోద‌ని టీసీఎస్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అమెరికా కార్మిక శాఖ ఇచ్చే ఆదేశాల‌కు అనుగుణం వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు టీసీఎస్ తెలిపింది. గ్రీన్ కార్డుల ప‌రిస్థితి ఎలా ఉన్నా, త‌మ కంపెనీ మాత్రం అమెరికాలో సుమారు 15వేల మందిని రానున్న అయిదేళ్ల‌లో రిక్రూట్ చేసుకోనున్న‌ట్లు టీసీఎస్ పేర్కొన్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events