Skip to main content

Namaste NRI

నితిన్‌ అలియాస్ రుక్మిణీ విడుదల తేదీ ఖరారు

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అలియాస్‌ రుక్మిణి. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకుడు కాగా, నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కాగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నితిన్‌ ఎలాంటి హంగులు లేకుండా, కళ్లద్దాలు పెట్టుకుని, భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా కనిపిస్తున్నారు. సహజమైన రూపంలో ఆయన కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ కృష్ణ అనే రచయిత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చిత్ర బృందం తెలిపింది. షూటింగ్‌తో పాటు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే వరుస ప్రమోషనల్ అప్‌డేట్స్ ఉంటాయని తెలుస్తోంది.ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, రచన-దర్శకత్వం: మురళీకాంత్‌ దేవసోత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events