Skip to main content

Namaste NRI

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ఈఎన్‌ఈ రిపీట్‌ లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిపార్ట్‌లో తమదైన కామెడీతో అలరించిన ఈ గ్యాంగ్‌ మరోమారు ప్రేక్షకులకు నవ్వుల్ని పంచేందుకు ముందుకొస్తున్నది.

ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా బాయ్స్‌ కొత్త మిషన్‌తో తిరిగి వచ్చారు. మీ గ్యాంగ్‌తో రెడీ అయిపోండి అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. నవంబర్‌ 19న ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్‌, నిర్మాతలు: సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి, రచన-దర్శకత్వం: తరుణ్‌భాస్కర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events