Skip to main content

Namaste NRI

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‎ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‎ను విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 9వ తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 16, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ, నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు, చిన్న గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌ పదవీకాలం మే 31 నాటికి ముగిసింది. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్‌ ఫరూద్దీన్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్‌ 3నాటికి ముగిసింది.  కరోనా నేపథ్యంలో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో అప్పటి నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Social Share Spread Message

Latest News