Skip to main content

Namaste NRI

అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడి

అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో తమ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమనిని కోల్పోయినప్పటి నుంచీ ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతూ వస్తోంది. అమెరికాపై కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మరోసారి రాకెట్‌ దాడులతో దద్దరిల్లింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని బాగ్దాద్‌లో పటిష్టమైన భద్రత నడుమ అమెరికా రాయబార కార్యాలయంపై దుండగులు రాకెట్లతో దాడి చేశారు. ఎంబసీ గ్రౌండ్‌లో రెండు రాకెట్లు  పేళాయి. మరో రాకెట్‌ రాయబార కార్యాలయం సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో పడిరది. దీంతో స్కూల్‌లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

                        అంతర్యుద్ధంతో నిత్యం అల్లకల్లోలంగా ఉండే ఇరాక్‌లో అమెరికా దళాలు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు సర్వసాధారణమయ్యాయి. ఈ మధ్య కాలంలో డజన్ల కొద్ది రాకెట్లు, డ్రోన్‌ బాంబులు కార్యాలయం ఆవరణలో పేళాయి. అయితే తాజా పేలుళ్లకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని ఇరాక్‌ సైన్యం ప్రకటించింది. కాగా, ఈ దాడిని అమెరికన్‌ ఎంబసీ తీవ్రంగా ఖండిరచింది. ఉగ్రవాద సంస్థలు ఇరాక్‌లో శాంతి భద్రతలను, అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో రాయబార కార్యాలయం క్వాంటిన్‌ ధ్వంసమైనట్లు ఇరాక్‌ విదేశాంగ మంత్రి జెబారి వెల్లడిరచారు. ఈ దాడుల వెనుక ఇరాన్‌ ప్రభుత్వం హస్తం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News