Namaste NRI

జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ సందడి

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, దర్శక దిగ్గజం రాజమౌళి కలిసి చేసిన భారీ పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ అనే విషయం అందరి తెలిసిందే. ఈ చిత్రం మొదటి  నుంచి సెన్సేషన్‌ హైప్‌ను క్రియేట్‌ చేసింది. వీరి ముగ్గురి కాంబినేషన్‌ ఇండ్రస్టీలో నెవర్‌బిఫోర్‌ కాంబినేషన్‌గా చరిత్రలో నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే ఇండియాతో పాటు యూఎస్‌లో భారీ రికార్డులు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం రిలీజ్‌ అయిన చాన్నళ్ల తర్వాత మళ్లీ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కన్పించారు. తాజాగా  జాపాన్‌ ఈ చిత్రం విడుదల కాబోతోంది.  ప్రమోషన్లలో భాగంగా జపాన్‌ వెళ్లిన వీరు అక్కడ మీడియాతో కాసేపు ముచ్చటించారు. అక్టోబర్‌ 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. అలియాభట్‌, అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, ఒలివియా మొర్రీస్‌, సముద్రఖనీ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వరల్డ్‌ వైడ్‌గా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. రాంచరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, ఎన్టీఆర్‌ కొమ్రంభీం పాత్రలో నటించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events