Skip to main content

Namaste NRI

రష్యా బెదిరింపులకు లొంగిపోయేది లేదు : జెలెన్‌స్కీ

రష్యా బెదిరింపులకు లొంగిపోయేది లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. యావత్‌ దేశాన్ని చిత్రహింసకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రష్యా ప్రజల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మేం ఉక్రెయిన్‌ పౌరులమని, మాకు వందల రకాల జాతీయ భావాలున్నాయని, వాటిని రష్యా సర్వనాశనం చేస్తున్నట్లు ఆరోపించారు. మన నేలను టార్గెట్‌ చేస్తూ ఓ దెయ్యం మనపై దాడి చేస్తోందని, ఈ దేశాన్ని ఆక్రమిస్తూ నేరాలకు పాల్పడుతున్న ఆ దేశాన్ని అన్ని రకాల విచారణ చేపడుతామన్నారు. ఆక్రమణతో నేరాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కర్నీ దండిస్తామన్నారు.

Social Share Spread Message

Latest News