Skip to main content

Namaste NRI

యాపిల్‌కు రష్యా జరిమానా

ఉక్రెయిన్‌పై రష్యాసైనిక చర్యకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడమే కాక, దాన్ని తొలగించడంలో విఫలమయ్యారన్న నేరారోపణపై రష్యా కోర్టు  వికిపీడియా, యాపిల్ సంస్థలకు జరిమానాలు విధించింది. ఈ మేరకు వికిపీడియా ఫౌండేషన్‌కు 3 మిలియన్ రూబుల్స్ (33,000 డాలర్లు) యాపిల్ కంపెనీకి 400,000 రూబుల్స్ (4400 డాలర్లు ) జరిమానాలు విధించింది. రష్యా మిలిటరీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని రష్యా మెజిస్ట్రేట్ కోర్టు వెల్లడించింది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు లేదా ప్రశ్నించినా రష్యా కఠిన చర్యలు తీసుకొంటుంది.

Social Share Spread Message

Latest News