Namaste NRI

అందులో రష్యా కీలకం.. దానినుంచి ఎవరూ తప్పించలేరు

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఆంక్షలతోనూ, ఆర్థిక  సంక్షోభంతోనూ, దౌత్యపరంగా ఒంటరై విలవిలలాడుతన్న రష్యాకు అండగా చైనా నిలిచింది. దౌత్యపరమైన రక్షణ కల్పించే కీలక ప్రకటన చేసింది. జీ`20లో రష్యా కీలక సభ్యదేశమని,  ఆ గ్రూప్‌ నుంచి సభ్యదేశాలేవీ రష్యాను  బహిష్కరించలేమని, ఆ హక్కు ఎవరికీ లేదని కుండబద్దలుకొట్టింది. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో గ్రూప్‌ 20 ముఖ్య భూమిక పోషిస్తోందని, అందులో రష్యా కీలకమని, దాని నుంచి ఎవరూ తప్పించలేరని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు.  పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాను అంతర్జాతీయ వేదికలనుంచి తొలగింగే దిశగా అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని వాషింగ్టన్‌లోని భద్రతా సలహాదారు ఒకరు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events