Skip to main content

Namaste NRI

మరో రెండు దేశాలకు రష్యా వార్నింగ్‌

స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాలను రష్యా ప్రభుత్వం హెచ్చరించింది. నాటోలో చేరాలన్న ఉద్దేశం సరికాదని,  కాదని ప్రయత్నాలు చేస్తే,  రాబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వుంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ద్వైపాక్షిక చర్చల  ద్వారా, బహిరంగంగా కూడా ఇప్పటికే చెప్పామని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా పేర్కొన్నారు. ఈ ప్రకటనను చూసి ఏమీ ఆశ్చర్యపోవాల్సిన  పని లేదని, ద్వైపాక్షిక చర్చల సమయంలోనూ, బహిరంగంగానూ ఇప్పటికే ఆ దేశాలకు హెచ్చరికలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.  స్వీడన్‌, ఫ్లినాండ్‌ దేశాలను నాటోలో చేర్చాలని ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని అమెరికా, యూరోపియన్‌ యూనియన్లను ఆయన హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News