Skip to main content

Namaste NRI

 ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరిక… ఇక కీవ్‌పై 

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తీవ్రరూపం దాల్చుతోంది. ఉక్రెయిన్‌ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని బెదిరిస్తోంది. తమ భూబాగం పై విధ్వంసాలకు దిగితే కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు లేదా విధ్వంసానికి పాల్పడాలని చూస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింత పెరుగుతాయి అని రష్యా రక్షణశాఖ  తెలిపింది. రష్యా సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ క్షిపణి దాడులు చేస్తోందని  క్రెమ్లిన్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా హెచ్చరికలు చేసింది.

                 తాజాగా కీవ్‌ నగర సమీపంలో ఉన్న మిస్సైల్‌ కంపెనీపై రష్యా తన క్రూయిజ్‌ క్షిపణితో దాడి చేసింది. కీవ్‌ ప్లాంట్‌లో ఉన్న దీర్ఘశ్రేణి, మధ్యశ్రేణి మిస్సైల్‌ వ్యవస్థలతో పాటు యాంటీ షిప్‌ మిస్సైళ్లు ధ్వంసం అయినట్లు రష్యా తెలిపింది. సరిహద్దు పట్టణాలపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్‌ హెలికాప్టర్లను వాడుతున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.

Social Share Spread Message

Latest News