Skip to main content

Namaste NRI

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్‌ ఫైటర్లకు అనుమతి ఇవ్వాలన్న అంశంపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాళ్లకు అనుమతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రష్యా దళాలకు సహకరించాలనుకున్న వారిని ఉక్రెయిన్‌కు పంపేందుకు పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. రష్యా బలగాలకు అండగా పోరాడేందుకు మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో సుమారు 16 వేల మంది వాలంటీర్లు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ తెలిపారు. రష్యా తరపున పోరాటం చేసేందుకు సిరియా ప్రభుత్వ దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో సిరియా అధ్యక్షుడు బాషర్‌ అల్‌ అసద్‌కు అండగా రష్యా బలగాలు సహకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరియా సాయం రష్యా తీసుకుంటుందో ఏమో అన్న ప్రచారం జరుగుతుంది.

Social Share Spread Message

Latest News