Namaste NRI

  రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఝలక్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌కు తన సలహాదారుడు రaలక్‌ ఇచ్చాడు. అనాటోలీ చుబైస్‌ తన పదవికి రాజీనామా చేశారు. అనాటోలీ చుబైస్‌ పుతిన్‌కు అంతర్జాతీయ సంబంధాలపై సలహాదారునిగా కొసాగుతున్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ చేస్తున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తూనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి డ్మిత్రీ పేస్కోవ్‌ పేర్కొన్నారు. అయితే ఈ చుబైస్‌ అత్యంత ప్రభావ శీలమైన వ్యక్తి మాత్రం కాదని ఓ వాదన కూడా వుంది. భద్రతా పరమైన వ్యవహారాల్లో ఆయనకు చాలా తక్కువ నిపుణత వుందని, పేర్కొంటున్నారు. భద్రతా సలహాదారుగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయడమనేది కచ్చితంగా సంచలన విషయమే అని కొందరు పేర్కొంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events