Skip to main content

Namaste NRI

అమెరికాపై రష్యా అధ్యక్షుడు విమర్శలు

అమెరికాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విమర్శల వర్షం కురిపించారు. హంగేరి ప్రధాని విక్టోర్‌ ఆర్బాన్‌తో పుతిన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఈ ఘర్షణను వాడుకోవాలని అమెరికా యత్నిస్తోందన్నారు. నాటో విషయంలో రష్యాలో నెలకొన్న ఆందోళనలను అమెరికా విస్మరిస్తోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌ భద్రతపై అమెరికాకు పెద్దగా ఆందోళన లేనట్లు ఉందన్నారు. రష్యా అభివృద్ధిని అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం ఆరోపించారు.  తన లక్ష్యం చేరుకోవడానికి ఉక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటోంది. ఇప్పుడు ఉక్రెయిన్‌ను నాటోలో చేరనిస్తే, తర్వాత అది మిగిలిన దేశాలను కూడా యుద్ధంలోకి లాగుతుంది అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News