Skip to main content

Namaste NRI

రష్యా దాడులు అత్యంత పాశవికం  : డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంపై మరోసారి స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పై ఆయన మండిపడ్డారు. ట్రంప్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. రష్యా దాడులు చేస్తుండడం అత్యంత పాశవికమైన చర్య అని అన్నారు.  ఆ దాడులను అత్యంత భయంకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి దుశ్యర్యలు ఎప్పటికీ జరగకూడదని అన్నారు. రష్యా దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఉక్రెయిన్‌ ప్రజల సంక్షేమం కోసం తాము ప్రార్థనలు చేస్తున్నామని తెలిపారు. యుద్ధం సమయంలో బైడెన్‌ తీరు కూడా సరిగ్గా లేదని మండిపడ్డారు.

Social Share Spread Message

Latest News