Skip to main content

Namaste NRI

సైంధవ్  క్లైమాక్స్ షెడ్యూల్‌ పూర్తి

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సైంధవ్‌ . శైలేష్‌ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ  చిత్రంలో  నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ైక్లెమాక్స్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 16రోజుల్లో ైక్లెమాక్స్‌ను పూర్తి చేశాం. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో హై ఇంటెన్సిటీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కించాం. వెంకటేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందించిన ైక్లెమాక్స్‌ ఇది. ఈ సినిమాలో వెంకటేష్‌ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. అసాంఘిక శక్తులపై ఆయన చేసిన పోరాటం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events