Skip to main content

Namaste NRI

ప్రవాసులకు ఆ దేశాల్లో జీతాలు అధికం

ప్రవాసులు వెళ్లేందుకు ప్రసిద్ధ గమ్యస్థానంగా సౌదీ అరేబియా నిలిచింది.  ఈసీఏ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ మై ఎక్స్‌పార్షియేట్‌ మార్కెట్‌ పే సర్వే నిర్వహించిన సర్వే ప్రకారం మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో ప్రవాసులు ఎక్కువ జీతం లభిస్తున్నట్లు వెల్లడైంది.  సౌదీ అరేబియాలోని మేనేజర్లు సగటున ఏడాదికి 83,763 పౌండ్లు (సుమారు రూ.88.64 లక్షలు) జీతం అందుకుంటున్నట్లు తెలిపింది. గతేడాదితో  పోలిస్తే ఈ ఏడాది మూడు శాతం తగ్గినప్పటికీ ప్రపంచంలోని మిగతా దేశాలలో పోలిస్తే ఇదే అధిక మొత్తమని సర్వే నివేదికలో పేర్కొంది. అలాగే, కంపెనీలు ఉద్యోగులను పంపేందుకు ఖరీదైన దేశంగా బ్రిటన్‌ ఉందని తెలిపింది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌  ప్రకారం ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హాంకాంగ్‌ మూడు స్థానాలు పైకి ఎగబాకి  ప్రపంచంలోనే ఐదో ఖరీదైన ప్రాంతంగా నిలిచిందని తెలిపింది. సింగపూర్‌ 16వ స్థానంలో ఉండగా, జపాన్‌, భారత్‌, చైనాలు వరుసగా రెండు, మూడు నాలుగు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events