Namaste NRI

ఈ సినిమా విషయంలోనూ జరిగేది అదే!

నవీన్‌ చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం తగ్గేదేలే. దివ్వ పిళ్లై, అనన్య రాజ్‌ నాయికలుగా నటిస్తున్నారు. భద్ర ప్రొడక్షన్స్‌ నిర్మించింది.  శ్రీనివాస రాజు దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌  వేడుక జరిగింది. ఈ సందర్భంగా  హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ మూడు కథల సమాహారమే సినిమా. పోరాటం, ప్రతీకారం, ప్రేమ బాగా కుదిరాయి. మీ అందరికీ నచ్చుతుంది అన్నారు. దండుపాళ్యం స్ఫూర్తితో  చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు తెలిపారు. పూజా గాంధీ మాట్లాడుతూ  మేం దండుపాళ్యం ప్రయాణం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతుంది. మా గ్యాంగ్‌ ఉన్న చోటంతా ఓ మేజిక్‌ జరిగింది. తగ్గేదేలే విషయంలోనే అదే మేజిక్‌ పునరావృతం అవుతుంది అన్నారు. యథార్థ ఘటనల్ని తెరపై ఆవిష్కరించే లక్ష్యంతోనే  ఈ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశాం అన్నారు నిర్మాత ప్రేమ్‌కుమార్‌.   ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.  ఈ కార్యక్రమంలో మరకరంద్‌ దేశ్‌పాండే, దివ్య పిళ్లై, అనన్య, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events