సంక్రాంతి-2025 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) ఆధ్వర్యంలో పిల్లలకి డ్రాయింగ్ ఈవెంట్, పెద్దలకు కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు,కైట్ ఫెస్టివల్ మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జపాన్ లో నివసించే తెలుగు మరియు జపనీస్ వారు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు.

ఉద్గ్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరం వారికి అందించే విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) నిరంతరం కృషిచేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.
