Skip to main content

Namaste NRI

ఉగాది సందర్భంగా సరిపోదా శనివారం…స్పెషల్ కొత్త పోస్టర్

నాని హీరోగా నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ఎస్‌.జే.సూర్య తదితరులు నటిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని, సాయికుమార్‌ సంప్ర దాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌ ఇది. కోపాన్ని క్రమపద్ధతిలో వాడుకుంటూ శనివారాలను మాత్రమే ముహూర్తాలుగా పెట్టుకొని శత్రువులను వేటాడే వ్యక్తిగా నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఆగస్ట్‌ 29న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, రచన-దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ.

Social Share Spread Message

Latest News