భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. వీసా నిబంధనల్లో కీలక సవరణ చేసింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించే నిబంధనను తొలగించింది. సౌదీ వీసా కోసం ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)ని సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. భారత్‌తో సౌదీకి ఉన్న బలమైన దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, వీసా కోసం పీసీసీ సమర్పించాలనే నిబంధన నుంచి భారతీయులకు మినహాయింపు ఇస్తున్నాం. ఇకపై భారతీయులు సౌదీ వీసా కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని భారత్‌లోని సౌదీ రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి, ఉద్యోగాల కోసం ఆ దేశానికి వలస వెళ్లే భారత పౌరులకు భారీ ఉపశమనం లభించినట్టైంది.














