Skip to main content

Namaste NRI

హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఈ ఏడాది

ముస్లింల పవిత్ర హజ్‌ యాత్ర  ముగింపు దశకు చేరుకుంది. అయితే, ఈ సారి ఈ పవిత్ర యాత్ర మృత్యుఘోష గా మారింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్‌ యాత్రికు లు అల్లాడిపోతున్నారు. ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ వేడికి తాళలేక ఇప్పటి వరకూ 550 మంది హజ్‌ యాత్రికులు మరణించినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. మరణించిన వారిలో ఈజిప్ట్‌, జోర్దాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు.

సుమారు 323 మంది ఈజిప్టియన్లు కాగా, 60 మంది జోర్డానియన్లు మ‌ర‌ణించినట్లు తెలిపారు. ఈ యాత్రలో చ‌నిపోయిన వారి సంఖ్య 577కి చేరిన‌ట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  మక్కాలోని అతిపెద్ద ఆసుప‌త్రుల్లో ఒక‌టైన‌ అల్-ముయిసెమ్ ఆసుప‌త్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే అందుకు కారణంగా తెలిపారు.  మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events