Namaste NRI

యూఎస్ ఓపెన్ కు సెరెనా దూరం

యూఎస్‌ ఓపెన్‌ కు టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ దూరమవుతున్నట్లు ప్రకటించింది. తన ఎడమ కాలి మడమ గాయం వల్ల ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ కు అందుబాటులో ఉండనని సెరెనా తెలిపింది. దీనికోసం ఆమె చికిత్స కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయారు. హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరీ పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. ప్రపంచంలో తనకు ఇష్టమైన నగరం న్యూయార్కేనని, అక్కడ యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడటం కంటే ఇష్టమైనది మరొకటి లేదని సెరెనా విలియమ్స్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News