Skip to main content

Namaste NRI

ప్రతినిధుల సభలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

పశ్చిమాసియాలో మూడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను నిలిపివేసే తీర్మానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ మెజారిటీ రిపబ్లికన్లలోని నలుగురు సభ్యులు డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. యుద్ధ అధికారాల తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లతో అమెరికా చట్ట సభలు ఆమోదించాయి. అనవసరమైన ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని డిమాండ్‌ చేశాయి. ఇరాన్‌తో జరిగిన యుద్ధంతో 100 బిలియన్‌ డాలర్లకు పైగా పెను భారం పడిందని చట్ట సభల ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే ఇరాన్‌ ముందు అమెరికా బలహీనపడేలా చేసిందని ఆరోపించారు. ఈ తీర్మానంతో యుద్ధం ఆగకపోయినా ట్రంప్‌ దూకుడు తగ్గే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News