Namaste NRI

శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది

 సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా శాకుంతలం. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్‌ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు.  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో శకుంతల పుట్టుక నుంచి తన భర్త దుష్యంతుడితో విడిపోయి తిరిగి కలిసే వరకు చూపిస్తున్నాం. అన్ని రకాల భావోద్వేగాలతో సినిమా ఉంటుంది. సెంటిమెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇందులో స్టార్‌ హీరోలు లేకున్నా కథను నమ్మి సినిమా రూపొందించాను అన్నారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ నిర్మాతగా 50కి పైగా చిత్రాలను నిర్మించాను. సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా మీ ఆదరణ పొందాను. మా సంస్థలో ఈ తరహా చిత్రం కూడా నిర్మించాలని అనిపించింది. కథ విన్నాక ఇదొక మంచి సినిమా అవుతుందని గట్టిగా నమ్మాను. నిర్మాతగా ఈ సినిమా నాకు నష్టం తెచ్చినా, లాభం తీసుకొచ్చినా అందుకు సిద్ధపడే నిర్మాణంలో భాగమయ్యాను. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలనే ప్రయత్నం చేశాను. భారీ బడ్జెట్‌ పెట్టామని ఈ సినిమాకు టికెట్‌ రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరలేదు. సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు చేర్చాలంటే అందుబాటులో టికెట్‌ రేట్లు ఉండాలి అన్నారు.

సమంత మాట్లాడుతూ నా చిన్నప్పుడు శకుంతల గురించి కొంచెం చదువుకున్నా. కానీ ఆమె కథ పూర్తిగా తెలియదు. శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఇది ఐదో శతాబ్దంలో రాసిన కథ. అయినా ఇప్పటికీ ఈ పాత్రలతో, కథా నేపథ్యంతో మనల్ని మనం పోల్చుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి వెబ్‌ సిరీస్‌ పూర్తి చేసుకుని వచ్చాక గుణశేఖర్‌ ఈ కథ చెప్పారు. శకుంతల అంటే అందంగా కనిపించే అమ్మాయి మాత్రమే కాదు. ఆత్మైస్థెర్యం, సాహ సం గల యువతి. ఈ పాత్రలో మెప్పించగలనో లేదో అనే సందేహంతో ఈ సినిమాలో నటించేందుకు మొదట నిరాకరించాను. ఇప్పుడు ఆ పాత్రకు న్యాయం చేశాననే భావిస్తున్నాను. నా జీవితంలో ఎదురైన కష్టాలే నన్ను బలమైన మహిళగా మార్చాయి. శకుంతలగా నటించిన స్ఫూర్తి వ్యక్తిగతంగా నేనూ పొందాను అని అన్నారు. త్రీడీ ఫార్మేట్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress