Skip to main content

Namaste NRI

అమెరికాలో కాల్పులు.. తండ్రి, కుమార్తె మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో భారత్‌కు  చెందిన తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో పని చేస్తున్న ఊర్మి(24), ఆమె తండ్రి ప్రదీప్ పటేల్(56) దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. మద్యం కోసం వచ్చిన దుండగుడు ముందురోజు రాత్రి స్టోర్ ఎందుకు మూసివేశారని పడ్డాడు. ఈ క్రమంలో అతను కాల్పులు జరపగా,  ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన ఊర్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించింది. పోలీసులు వెంటనే ఆ స్టోర్ వద్దకు చేరుకున్నారు. నిందితుడైన 44 ఏళ్ల జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్‌ను అరెస్ట్‌ చేశారు.

మరోవైపు గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ కుటుంబం ఆరేళ్ల కిందట అమెరికా వచ్చింది. తమ బంధువైన పరేష్ పటేల్‌కు చెందిన స్టోర్‌లో ప్రదీప్‌ ఆయన కుమార్తె ఉర్మి పని చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలున్నట్లు బంధువులు తెలిపారు. ఒకరు కెనడాలో, మరొకరు అహ్మదాబాద్‌లో నివసిస్తున్నట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News