Namaste NRI

మిల్పిటాస్‌లో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవం

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ నగరంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవాన్ని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో వేడుకగా నిర్వహించారు. కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో శ్రీనాథుడు తెలుగు పద్మ నాటకం ప్రదర్శించారు. గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్రను, సిలికానాంధ్ర కుటుంబసభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. లకిరెడ్డి హనిమిరెడ్డి గుమ్మడి గోపాలకృష్ణను సత్కరించి, పదివేల డాలర్ల బహుమతి ప్రకటించారు.  యూనివర్సిటీ ఆఫ్‌ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే సంవత్సరం నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్లు సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, వారి సోదరుల సమక్షంలో కూచిభొట్ల ఆనంద్‌ ప్రకటించారు.  

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బూదరాజు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇప్పటివరకూ ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా ఒక పద్య నాటక ప్రదర్శన చూడలేదని, అమెరికాకు వచ్చి ఇక్కడ ఇలా సిలికానాంధ్ర సంస్థలో చూడగలగడం తన అదృష్టమని పేర్కొన్నారు.  సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌, వైస్‌ చైర్మన్‌ దిలీప్‌ కొండిపర్తి, మాజీ అధ్యక్షులు సంజీవ్‌ తనుగుల, విజయసారథి మాడభూషి, ప్రస్తుత కార్యవర్గ నాయకులు కిరణ్‌ సింహాద్రి, సాయి కందుల, శివ పరిమి, పూర్వ కార్యవర్గ సభ్యులు శాంతివర్ధన్‌ అయ్యగారి, ప్రియ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, వంశీ నాదెళ్ల , బేరియా తెలుగువారు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events