Namaste NRI

 సింగపూర్ తెలుగు సమాజం…నూత‌న కార్య‌వ‌ర్గం ఇదే

సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం అధ్య‌క్షుడిగా బొమ్మారెడ్డి శ్రీ‌నివాసుల రెడ్డి ఎన్నిక‌య్యారు. ఆయ‌న సార‌ధ్యంలో కార్య‌వ‌ర్గానికి పోటీ చేసిన వారు గెలుపొందారు.  ఈ నెల ఒక‌టో తేదీ నుంచి కొత్త కార్య‌వ‌ర్గం బాధ్య‌త‌లు స్వీక‌రించింద‌ని స‌మాజం గౌర‌వ కార్య‌ద‌ర్శి స‌త్య చిర్ల తెలిపారు. ఈ నెల 21న కొత్త కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్బంగా  అధ్య‌క్షుడు బొమ్మారెడ్డి శ్రీ‌నివాసుల రెడ్డి మాట్లాడుతూ అంద‌రినీ క‌లుపుకుని వెళుతూ వినూత్న కార్య‌క్ర‌మాల‌తో స‌మాజాన్ని ముందుకు తీసుకెళ్తామ‌ని చెప్పారు. స‌మాజాన్ని మ‌రింత ప్ర‌గ‌తి ప‌థంలోకి తీసుకువెళ్లేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌న్నారు. కొత్త క‌మిటీ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మే ఒక‌టో తేదీన అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం నిర్వ‌హిస్తున్న‌ట‌లు స‌మాజం నూత‌న గౌర‌వ కార్య‌ద‌ర్శి అనిల్ పొలిశెట్టి తెలిపారు.

ఎన్నికైన నూత‌న కార్య‌వ‌ర్గం ఇదే

అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గౌరవ కార్యదర్శి – పొలిశెట్టి అనిల్ కుమార్, గౌరవ కోశాధికారి – బచ్చు ప్రసాద్, ఉపాధ్యక్షులు- కురిచేటి జ్యోతీశ్వర్‌ రెడ్డి, పాలెపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి, టేకూరి నగేష్, నిర్వహణ కార్యదర్శి-కురిచేటి స్వాతి, సహాయ కోశాధికారి-జూనెబోయిన అర్జునరావు,  ప్రాంతీయ కార్యదర్శులు- బోయిని సమ్మయ్య, కలిదిండి ఫణీంద్ర వర్మ, మేరువ కాశి రెడ్డి, మ్రితివాడ రాంరెడ్డి, కమిటీ సభ్యులు-బద్దం జితేందర్ రెడ్డి, బాలగా రమణారావు, బండ్ర శేషగిరి, గాడిపల్లి చంద్రమౌళి, గుజ్జుల శ్రీలక్ష్మి, కొత్తా సుప్రియ, రాపేటి జనార్ధనరావు, స్వామి గోపి కిషోర్, వైద మహేష్, ఎఱ్ఱాప్రగడ చాణక్య, గౌరవ ఆడిటర్లు – ఆలపాటి వెంకట రాఘవ రావు, రొడ్డా సతీష్ బాబు ఎన్నిక‌య్యారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress