Skip to main content

Namaste NRI

దిల్ రాజు క్లాప్ తో సీతాకళ్యాణ వైభోగమే

సుమన్‌, గరీమ చౌహాన్‌ జంటగా నటిస్తున్న సినిమా సీతా కళ్యాణ వైభోగమే. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌ ఇచ్చారు. హర్షిత్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నాంది ఫేమ్‌ విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దర్శకుడు సతీష్‌ పరమవేద మాట్లాడుతూ నేను దిల్‌ రాజు గారి సంస్థలో పని చేశాను. రామాయణ గాథ స్ఫూర్తితో ఈ సినిమా కథను రాసుకున్నాను. నల్గొండలో సంచలనం కలిగించిన ఓ ప్రేమ కథ ఘటన అంశాలనూ ఇందులో చేర్చాం అన్నారు. హీరోగా నా తొలి చిత్రమిది. నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అన్నారు సుమన్‌. ఈ నాగినీడు, రచ్చ రవి, గగన్‌ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  సతీష్‌ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్‌ గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాచాల యుగంధర్‌ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మామిడి హరికృష్ణ, చరణ్‌ అర్జున్‌, గరిమ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News