Namaste NRI

స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ. టీజర్‌ విడుదల

స్వీయ దర్శకత్వంలో విక్రాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ. మోహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను మంత్రి జగదీష్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్రాంత్‌ మాట్లాడుతూ ఈ సినిమా కథపై రెండేళ్ల పాటు పనిచేశాను. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సుహాసిని, నాజర్‌ వంటి సీనియర్‌ నటులు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. కథానుగుణంగా అద్భుతమైన సాహిత్యం కుదిరింది అని పేర్కొన్నారు.

మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ  ఈ సినిమా టీజర్‌లో మంచి స్పార్క్‌ కనిపించింది. గత పదిహేనేండ్లుగా తెలుగు సినిమా ట్రెండ్‌ మారింది. ఈ సినిమా టీజర్‌ చూడగానే శివ సినిమా గుర్తుకొచ్చింది. ఇదొక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిపోతుందని భావిస్తున్నా అన్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ గొప్పగా ఉందని అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని కథానాయిక మోహరీన్‌ చెప్పింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, నవీన్‌ ఎర్నేని, వివేక్‌ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events