Namaste NRI

వీసాల జారీ వేగవంతం… జైశంకర్ కు బ్లింకెన్ హామీ

అమెరికా వీసాల కోసం భారతీయులు దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితులకు కరోనానే కారణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ నిందించారు. వాషింగ్టన్‌ లో బ్లింకెన్‌తో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌  భేటీ అయ్యారు. వీసా అయింట్‌మెంట్ల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నట్టు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బ్లింకెన్‌ మాట్లాడుతూ కొద్ది నెలల్లోనే సమస్యను పరిష్కారిస్తామని జైశంకర్‌కు హామీ ఇచ్చారు.  2020 మార్చి నుంచి కొద్ది నెలల పాటు వీసా ప్రక్రియ నిలిపివేయడంతో వేచి చూసే సమయం పెరిగిపోయిందని, వీసాల త్వరితగతి మంజూరు కోసం ఒక ప్రణాళికను సిద్దం చేస్తున్నామని బ్లింకెన్‌ స్పష్టం చేశారు. మరి కొద్ది నెలల్లోనే వీసా ల జారీ వేగవంతం అవుతుంది అని అన్నారు. కరోనా కారణంగా మా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించాం. ఇప్పుడు మళ్లీ సిబ్బందిని పెంచడానికి ఒక ప్రణాళిక చర్యలు చేపడతాం అన్నారు. అనంతరం జైశంకర్‌ మాట్లాడుతూ వీసా ప్రక్రియ వేగవంతం చేయడం ఇరు దేశాలకూ ప్రయోజనకరమని అన్నారు. వీసాల జారీలో అడ్డంకుల్ని అధిగమించాలన్నారు.

Social Share Spread Message

Latest News