Skip to main content

Namaste NRI

ఒక్క పాట కోసం  15 కోట్లు ఖర్చుపెడుతున్నారా?

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్నది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ, అంజలిలు నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాట కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 12 రోజుల పాటు చిత్రీకరించే ఈ పాట కోసం అంత భారీ ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. శంకర్‌ చిత్రాల్లో భారీతనం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. సన్నివేశాలే కాదు పాటల చిత్రీకరణ కూడా ఘనంగా ఉంటుంది. ఖరీదైన సైట్స్‌, అరుదైన లొకేషన్స్‌, గ్రాఫిక్స్‌తో ఈ దర్శకుడు గతంలో పాటల చిత్రీకరణ జరిపారు. మరి రామ్‌ చరణ్‌ చిత్రంలో ఆయన ఎలాంటి  తరహా పాట రూపొందిస్తున్నారు. ఆ పాటకు 15 కోట్ల  రూపాయల ఖర్చు ఎలా అయ్యిందనేది మున్ముందు తెలియనుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఇందులో రామ్‌ చరణ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Click Here
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events