ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను మరో అవార్డు వరించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రాణాయామం, ఒత్తిడి నివారణ, యోగా, ధ్యానంపై స్వచ్ఛందంగా బోధిస్తున్నారు. అమెరికాలోని మెంఫిస్‌లో జాతీయ పౌరహక్కుల మ్యూజియం ఆయనకు ది ఎమిసరీ ఆఫ్ పీస్ ( శాంతి దూత) అవార్డును అందజేసింది. శ్రీశ్రీ రవిశంకర్‌కు అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉన్నదని మ్యూజియం బోర్డు డైరెక్టర్ శైలా కర్కేరా పేర్కొన్నారు. మానవతావాదిగా, శాంతి రాయబారిగా, యోగా, ధాన్యం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని జాతుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.














