Skip to main content

Namaste NRI

సమంత చేతుల మీదుగా శ్రీదేవి శోభన్‌ బాబు టీజర్‌

టాలీవుడ్‌ యువ హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నటి సమంత సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు మనం చెప్పుకోబోయే చిత్రం.. అనే వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రేడియోలో కథ చెప్తున్నట్టుగా పాత్రలను పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాయకానాయికల అల్లరి చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ శ్రీదేవి, శోబన్‌ బాబు కథ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రన్‌ స్వరాలందిస్తున్నారు. నాగబాబు, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది మారుతి డైరెక్షన్‌లో మంచి రోజులొచ్చాయి సినిమాతో అందరినీ పలుకరించాడు సంతోష్‌ శోభన్‌. గౌరి జి.కిషన్‌ కథానాయిక. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events