Namaste NRI

శ్రీనివాస మంగాపురం పస్ట్‌ సాంగ్‌ విడుదల

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. డా.మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రషా తడాని కథానాయిక. అజయ్‌ భూపతి దర్శకుడు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ సమర్పణలో పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు.

అగ్ర హీరో నాని పాట ను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అల్లెల్లే.. అల్లెల్లే.. అదిరే కలలే.. అల్లెల్లే.. అల్లెల్లే.. కలిసే ఎదలే.. అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరపరచి, హరిప్రియతో కలిసి ఆలపించారు. మెలోడియస్‌గా మొదలై, ఉత్సాహవంతంగా ఈ ట్రాక్‌ సాగింది. ప్రేమలోని భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటకు జయకృష్ణ, రషా కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్‌ కూడా అందంగా ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ఐఎస్‌సీ, నిర్మాణం: చందమామ కథలు.

Social Share Spread Message

Latest News