Skip to main content

Namaste NRI

కథ వెనుక కథ టైటిల్‌,  ఫస్ట్‌ లుక్‌  లాంచ్‌  

విశ్వంత్‌, శ్రీజిత ఘోష్‌, శుభశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం కథ వెనుక కథ. కృష్ణచైతన్య దర్శకుడు. దండమూడి బాక్సాఫీస్‌, సాయిస్రవంతి మూవీస్‌ పతాకంపై దండమూడి అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ మరియు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వంత్‌ మాట్లాడుతూ  ఈ టైటిల్‌ వెనుక ఎన్నో కథలున్నాయి. ఈ సినిమాతో గట్టిగా కొట్టబోతున్నాం. దీని కోసం అందరం ఎంతో కష్టపడ్డాం అన్నారు.  ఈ చిత్రంలో చాలా కథలుంటాయి. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఇందులో నేను ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తా అన్నారు నటుడు సునీల్‌.  నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగే చిత్రమిది.  కథ వెనుక కథ ఏమిటన్నది ఆసక్తికరంగా అనిపిస్తుంది అన్నారు. మనందరి జీవితాల్లో చాలా కథలుంటాయి. వాటి వెనక జరిగిన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. అలాగే ఈ సినిమా కథ కూడా ఉత్కంఠను కలిగిస్తుంది. లార్జ్‌ స్కేల్‌లో ఈ సినిమా చేశాం అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌, సునీల్‌, ఆలీ, రఘుబాబు, బెనర్జీ, ఆర్పీ పట్నాయక్‌  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News