ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్య జీవితంలో మగవారు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వెబ్ సిరీస్‌లో తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ సేవ్ ద టైగర్స్ అంటే మా వెబ్ సిరీస్‌లో భర్తలను కాపాడుకుందాం అని చెబుతున్నాం. యాడ్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో నటించాను. లాయర్‌గా పనిచేస్తున్న భార్యతో భర్తగా ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనేది వినోదాన్ని పంచుతుంది అన్నారు. జోర్దార్ సుజాత మాట్లాడుతూ నేను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఇప్పటివరకు యాంకర్‌గా మీ ఆదరణ పొందాను. ఈ వెబ్ సిరీస్‌లో హైమావతి అనే గృహిణి పాత్రలో ఆకట్టుకుంటా. భర్తకు స్ఫూర్తినిచ్చే భార్య పాత్రలో కనిపిస్తా అని అన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నది.